హోమ్ టాప్ న్యూస్ టీజీఈజేఏసి పోరాటాలతో మరో విజయం

టీజీఈజేఏసి పోరాటాలతో మరో విజయం

0

-జిఓ 317 బాధిత ఉద్యోగులకు ఊరట

మంచిర్యాల ప్రత్యేక్షత:-తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజేఏసీ) పోరాటాలతో జేఏసీ మరో విజయం సాధించిందని, జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కే వనజా రెడ్డి లు బుధవారం ప్రకటనలో తెలిపారు. టీజిఈజెఏసి నిరంతర పోరాటం వలన జిఓ నెంబర్ 317 బాధిత ఉద్యోగుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్, బదిలీలకై సెప్టెంబర్ 16, 2025న జీఓం నెంబర్ 190 విడుదల చేసిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా టిజిఈజేఏసి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉద్యోగుల క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సభ్యులు, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మహేష్ దత్, స్పెషల్ సిఎస్ జిఏడి సర్వీసెస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని నిరంతరం శ్రమిస్తూ, పాటు పడుతూ జీఓ నెంబర్ 190 విడుదలకు విశేషంగా కృషిచేసిన టీజీఈజెఏసి చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు లకు సైతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీఈజెఏసి కో-చైర్మన్ లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, ధరణికోట వేణుగోపాల్, పోడేటి సంజీవ్,రమేష్,వెంకటేశ్వర్లు,సత్తయ్య,రవి,సుమిత్, డిప్యూటీ చైర్మన్ భూముల రామ్మోహన్, వైస్ చైర్మన్లు ఎస్ గంగాధర్, జయకృష్ణ, రాజవేణు,రవీందర్,శ్రావణ్ కుమార్, మోహ్సిన్ అహ్మద్, పబ్లిసిటీ కార్యదర్శి జాడి రామ్ కుమార్, కార్యదర్శి తంగళ్లపల్లి తిరుపతి, టీఎన్జీవోఎస్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్, నరేందర్, వెంకటేష్, యూసఫ్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version