-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పునస్కరించుకొని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన,రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ సమిష్టిగా కృషిచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,ఉపాధ్యక్షులు రామ్ కుమార్,పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.