-10వేల ను విరాళంగా అందించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- లక్షెట్టిపేట్ టిఎన్జీవో నూతన భవన నిర్మాణం కొరకు విరాళాలు సేకరణ ప్రారంభించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి 10 వేల రూపాయలు ను తమ వంతుగా అందించారు. అలాగే లక్షెట్టిపేట్ యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్ ఒక నెల జీతం కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ 5 వేల రూపాయలును విరాళంగా అందజేశారు. జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు నరేందర్ లు ఒక్కొక్కరు 10వేలు రూపాయలను విరాళంగా అందించారు. మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, దండేపల్లి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ 5 వేలు రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని టీఎన్జీవో యూనిట్ అధ్యక్షులు,కార్యదర్శులు,సభ్యులందరూ టీఎన్జీవో నూతన భవన నిర్మాణం కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.