హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో భవనంలో ఘనంగా జన్మదిన వేడుకలు

టీఎన్జీవో భవనంలో ఘనంగా జన్మదిన వేడుకలు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు ల జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. వారిద్దరూ మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కోశాధికారి అనుముల సతీష్ కుమార్ ,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రామ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్ ప్రశాంత్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version