హోమ్ టాప్ న్యూస్ కలెక్టర్ కి మట్టి విగ్రహం అందించిన హౌసింగ్ కాలనీ సభ్యులు

కలెక్టర్ కి మట్టి విగ్రహం అందించిన హౌసింగ్ కాలనీ సభ్యులు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ బోర్డ్ కాలనీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ సముదాయ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం అందించేందుకు హౌసింగ్ బోర్డ్ వినాయక మండలి సభ్యులు టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి నేతృత్వంలో కలెక్టర్ చేతుల మీదుగా కాలుష్యం నియంత్రణ మండలి రూపొందించిన మట్టి వినాయకుడి ప్రతిమ పోస్టర్లు ఆవిష్కరించారు. టీఎన్జీవో హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్వహించే సిద్ధి వినాయక మండలి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ప్రోత్సహించే పర్యావరణహితమైన మట్టి వినాయకుని పూజించాలని మట్టి వినాయకుని విగ్రహాన్ని కలెక్టర్ కు అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడియారం శ్రీహరి,కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభుత్వ”వాల్టా “చట్టం అథారిటీ సభ్యుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి సైండ్ల మొండయ్య, పొన్న మల్లయ్య, శ్రీపతి బాబు రావు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version