-పెద్దపెల్లి ఎంపీ తో పలు సమస్యలపై చర్చించిన: టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని ఐటిఐ సెంటర్, అడ్వాన్స్డ్ టెక్నాలజి సెంటర్ (ఏటీసీ) లను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ సందర్శించిన సందర్భంగా మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తో చర్చించారు. ఎంపీ స్థానికులంగా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలపై తమ వంతు సహాయం చేస్తానని అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ కమిటీ మంత్రులతో చర్చించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా టిఎన్జీవో కమిటీ తరపున ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మంచిర్యాల జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి