-భాజభజేంత్రీలతో ఘనంగా గణనాథుని ఊరేగింపు

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలో గల టీఎన్జీవోఎస్ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో శ్రీ సిద్ధి వినాయక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండప నిర్వహకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా భాజభజేంత్రీలతో నృత్యం చేస్తూ ఆ గణనాథునికి ఘనంగా మండపం వద్దకు శోభయాత్ర నిర్వహించారు.పర్యావరణానికి కాలుష్యం కాకుండా ఇలాంటి పరిరక్షణకు హాని జరగకుండా మట్టి విగ్రహానికి విశిష్ట పూజలు అందించారు.

గణనాధుని మొదటి పూజలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మట్టి విగ్రహ దాత గుండేటి యోగేశ్వర్, అసోసిమెంట్ అధ్యక్షులు పొన్న మల్లయ్య దంపతులు అర్చకుల మంత్రాల ఉచ్చరణ మధ్య ఘనంగా గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ..ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కి రావలసిన పెండింగ్ బిల్స్ డిఏలు పిఆర్సి హెల్త్ కార్డ్స్ అందరికీ సంబంధించిన 63 డిమాండ్లను వెంటనే ప్రభుత్వం మంజూరు చేసే విధంగా చూడాలని గణేశుని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు హబీబ్ హుస్సేన్,సైదం మొండయ్య, కస్తూరి నాగేశ్వర్, శ్రీపతి బాబురావు,చంద్రశేఖర్ రెడ్డి,రాజేందర్,అరుణ, కమల,కళావతి,స్వప్న మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు