హోమ్ టాప్ న్యూస్ టిఎన్జీవో ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

టిఎన్జీవో ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

0

-నివాళులర్పించిన టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ని పురస్కరించుకొని జిల్లా టీఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ,మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెలంగాణ ను సాధించుకోవడానికి ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజానీకం మరువబోదని వారి చూపిన బాటలో తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులందరూ కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు కేజియా రాణి, రామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి రవి కిరణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version