-హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం

మంచిర్యాల ప్రత్యక్షత:-నాయబ్ తహసిల్దార్ గా ప్రజలకు సేవలు అందిస్తున్నందుకుగాను జిల్లా ఉత్తమ అధికారిగా పునస్కారం అందుకున్న టీఎన్జీవో అధ్యక్షులు జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి ఎన్నికయ్యారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సలహాదారు హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ అధికారి గా పునస్కార ప్రశంస పత్రం నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి అందుకున్నారు.ఈ పునస్కారం అందుకున్న సందర్భంగా టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు, కోశాధికారి అనుముల సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రామ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్ ప్రశాంత్ పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి