హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ముగ్గుల పోటీలు

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ముగ్గుల పోటీలు

0

-పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతి అందజేత

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యనిర్వహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి,జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి భాగ్యవతి,విశిష్ట అతిథులుగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి హబీబ్ హుస్సేన్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పుప్పాల హనుమంత రావు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి నాగేశ్వరరావు,కోశాధికారి సైoడ్ల మొండయ్య, అసోసియేట్ అధ్యక్షులు భూముల రామ్మోహన్,పొన్న మల్లయ్య,శ్రీపతి బాపురావు ,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ విచ్చేశారు.

సంక్రాంతి పండుగ పర్వదిన పర్వదినాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో కాలనీలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం టీఎన్జీవో కాలనీలో ఎటువంటి పండుగ వేళ మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గులు వేసి ముందస్తు సంబరాలు విజయవంతం చేయడంలో టిఎన్జీవో కాలనీ మహిళల కృషి గొప్పదని కొనియాడారు. అదేవిధంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రాం కు టీఎన్జీవో కాలనీ మహిళలు సభ్యుల సహాయ సహకారాలు అందించాలని కోరారు. తదుపరి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. టీఎన్జీవో కాలనీలో ప్రతి పండుగను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తున్నారని మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.సంక్రాంతి ముగ్గుల పోటీలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కేజియా రాణి,తిరుపతి, రాంకుమార్,సంయుక్త కార్యదర్శి సునీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్,బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్,టిఎన్జీవో కాలనీ లోని మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందినవారికి మెమొంటో తో పాటు ప్రథమ స్థానం వారికి 3 వేలు, ద్వితీయ స్థానం వారికి 2వేలు,తృతీయ స్థానం వారికి వెయ్యి రూపాయలు అదేవిధంగా పిల్లలకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాల అధికారి హనుమంతరావు సతీమణి జ్యోతి బహుమతులు ప్రధానం చేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version