మంచిర్యాల జిల్లా ఒకటవ వార్డ్ తెలంగాణ నగర్, రాజీవ్ నగర్ శ్రీ శివ పంచాయతన సహితి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఏడువ దేవయ సప్తమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం సేవ,ఆరు గంటలకు ద్వజరోహణ, ఎనిమిది గంటలకు గణపతి పూజ తొమ్మిది గంటలకు నవగ్రహ ప్రధాన మండప ఆరాధన అంకురారోహణం పదకొండు గంటలకు హోమం 12 గంటలకు మంత్రపుష్ప నైవేద్య తీర్థ ప్రసాదం వితరణ, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సుమారు 500 కు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఏటా ఇదే విధంగా భక్తులు మీ సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఊట్కూరి వెంకట చారి, పూసాల వినయ్ ఆలయ కమిటీ అధ్యక్షులు బల్ల రవికుమార్, రమేష్, రాజయ్య, శ్రీనివాస్, పీచ్చే శ్వరరావు, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, సుధాకర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి