హోమ్ టాప్ న్యూస్ జిల్లా పశుసంవర్ధక శాఖలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

జిల్లా పశుసంవర్ధక శాఖలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

0

-ఉద్యోగుల సమస్య పరిష్కారంలో టీఎన్జీవో: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత్వ నమోదు ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హాజరయ్యారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈ.శంకర్ పాల్గొని టీఎన్జీవో యూనియన్ యొక్క నియమ నిబంధనలను గురించి ఉద్యోగులకు వివరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో జిల్లా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఆయన తెలిపారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు, జిల్లా ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్, తంగళ్లపల్లి తిరుపతి,జిల్లా సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల ఫోరం అధ్యక్షురాలు విజయ భారతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు ప్రకాశ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేశ్, జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ గంగారం సభ్యులు గంగమల్లు,సత్తయ్య,ఇందిరా,సోనీ, శృతిలయ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version