హోమ్ టాప్ న్యూస్ గద్దెపై కొలువుదీరిన సమ్మక్క..! పోటెత్తిన భక్తులు..!

గద్దెపై కొలువుదీరిన సమ్మక్క..! పోటెత్తిన భక్తులు..!

0

-అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గని పై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో గురువారం సమ్మక్క అమ్మ వారు గద్దె పై కొలువు తీరింది. అమ్మవారిని గిరిజన పూజారులు, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి అమ్మవారిని గద్దెకు చేర్చారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ దంపతులు కుటుంబ సభ్యులు హాజరై,పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్కే 1ఏ గనిపై నిర్వహించూ సమ్మక్క సారలమ్మ జాతరకు పట్టణ, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, ఉద్యోగులు అందరు విచ్చేసి, అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు.సమ్మక్క సారలమ్మ లు కొలువు తీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని, మొక్కలు చెల్లించెందుకు పోటెత్తారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సింగరేణి ఏరియా యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది.శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కలు చెల్లించడం జరుగుతుంది. అనంతరం శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ పర్యవేక్షణలో మందమర్రి సిఐ పర్సా రమేష్ సారధ్యంలో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ శ్రీధర్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐ లు, పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. కాగా అమ్మవార్లను రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి కల్పన శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి లు దర్శించుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సమ్మక్క, సారలమ్మ పూజారి దూలం కనకయ్య గౌడ్, ఆయన కుమార్తె సరిత, సింగరేణి అధికారులు,యూనియన్ నాయకులు, ఉద్యోగులు, రామకృష్ణాపూర్, మందమర్రి, ప్రముఖులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version