-అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసిన జాతర

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-గత నాలుగు రోజులుగా ఏరియాలోని ఆర్కే 1 ఏ గని పరిసర ప్రాంతంలోని పాలవాగు సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసింది. చివరి రోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవతలు వన ప్రవేశం చేశారు. ఆర్కే 1ఏ గని ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గద్దలపై అమ్మవారు కొలువై, భక్తుల పూజలు, అందుకొన్న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతర నేటితో ముగిసింది. జాతర ముగింపు సందర్భంగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, యూనియన్ ప్రతినిధులు,ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజన సంప్రదాయం ప్రకారం అమ్మవార్లను వన ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు, గిరిజన పూజారులు భక్తులు పాల్గొన్నారు.