
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో మంగళవారం టిఎన్జీవో మంచిర్యాల యూనిట్ క్యాలెండర్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య ఆవిష్కరించారు. టీఎన్జీవో మంచిర్యాల అధ్యక్షుడు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించని ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, విశిష్ట అతిథులుగా టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం, కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు లు హాజరయ్యారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ క్యాలెండర్ ను, టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ, టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ క్యాలెండర్ ను చాలా బ్రహ్మాండంగా తయారు చేశారని అభినందించారు. ఇందులో పొందుపరిచిన ప్రతి అంశము ఉద్యోగులకు విధి నిర్వహణలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా కార్యవర్గానికి, మంచిర్యాల యూనిట్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం టిఎన్జీవో నాయకులు అదనపు కలెక్టర్ రెవెన్యూగా ఉన్న చంద్రయ్య ఐఏఎస్ పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా టీఎన్జీవో నాయకులు పూల మొక్కని అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, అంజయ్య, కేజియా రాణి, పద్మలత, నరేందర్, శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శులు సునీత ప్రభు, సురేందర్, రోశయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, పబ్లిసిటీ కార్యదర్శి యూసుఫ్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్, లక్షేట్టిపేట్ యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్, కన్నెపల్లి యూనిట్ అధ్యక్షుడు పద్మనాభం, జిల్లా నాయకులు పద్మజా, రాజేందర్, కుమార్, మోసిన్, ప్రణవానంద్, సరిత లు పాల్గొన్నారు.