హోమ్టాప్ న్యూస్ఉషోదయ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

ఉషోదయ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

Published on

spot_img

-50 మంది వాకర్స్‌తో ఉత్సాహంగా యోగా నిర్వహణ

మంచిర్యాల ప్రత్యక్షత:-ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఉషోదయ పాఠశాల ఆవరణలో ప్రతి ఏడాది నిర్వహించే యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రేగళ్ల కృష్ణమూర్తి, కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉషోదయ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. భారత జెండాకు ప్రణామం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సభ్యులు యోగాసనాలు, 120 సూర్య నమస్కారాలు నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రార్థనతో పాటు జెండా ప్రణామంతో కార్యక్రమం ఆధ్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాగిందన్నారు. భారతదేశ సంస్కృతిలో యోగాకు ఉన్న విశిష్ట స్థానం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. భారతదేశంలో జన్మించినందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు ఉషోదయ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this