-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల ప్రత్యేక్షత:-రెవెన్యూ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కొక్కసారి నిర్ణీత పని వేళలను మించి పని చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. కార్యాలయాలలో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40 సంవత్సరాల వయసుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని,నిత్యజీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి