-మందమర్రి జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్

మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా నవసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తనదైన శైలిలో వార్తా కథనాలు రాస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభవేక్ష ఆశించకుండా సామాన్య జర్నలిస్టుగా జాడ క్రాంతి కుమార్ టైమ్స్ ఆఫ్ వార్త దినపత్రికలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి

తెలంగాణ సంస్కృతి సాహిత్య సేవా సంస్థ మాచవరం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాదులోని త్యాగరాజ గానసభ లోని ఆడిటోరియంలో ఉత్తమ జర్నలిస్టు అవార్డుని మందమర్రి గ్రామానికి చెందిన జాడ క్రాంతి కుమార్ కు అందజేశారు.ఈసందర్భంగా అవార్డ్ అందుకున్న జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని అవార్డుతో బాధ్యత పెరిగిందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
