హోమ్టాప్ న్యూస్ఆర్కేపిలో మాదకద్రవ్యాలపై పోలీసుల తనిఖీలు

ఆర్కేపిలో మాదకద్రవ్యాలపై పోలీసుల తనిఖీలు

Published on

spot_img

-గంజాయి సేవించినట్లు వ్యక్తి అంగీకారం

-సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం:ఎస్ఐ శ్రీధర్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, నిల్వలను అరికట్టే చర్యల్లో భాగంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.తనిఖీల సమయంలో నార్కోటిక్ డాగ్ ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించగా, పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భగత్ సింగ్ నగర్‌కు చెందిన దానవీన కుమారస్వామి (38), సింగరేణి ఉద్యోగిగా గుర్తించారు. అతను పట్టణంలోని సి హెచ్ పి ప్రాంతంలో గంజాయి సేవించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇకపై ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటానని అతను హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీధర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని, ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this