-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్లు సమస్యలపై టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి టీఎన్జీవో ఎస్ఎల్ఆర్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్, సెక్రెటరీ సైదులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.సర్వేయర్లకు సర్వే నిర్వహించేటప్పుడు సరైన పరికరాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకుగాను జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి సర్వేయర్లకు వినియోగించి పరికరాలను డిజిపిఎస్ రోవర్స్,ల్యాప్టాప్స్, ప్రింటర్స్, మండల సర్వేయర్లకు ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఏవో తో చర్చించి వీలైనంత త్వరగా ఆ పరికరాలను అందజేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. జిల్లా టీఎన్జీవో తరఫున జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.