-ప్రమాదాల నివారణకు ప్రతిష్టమైన చర్యలు

-స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటిన:అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల ప్రత్యక్షత:- మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో రిసెప్షన్, సిసిటిఎస్ విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పనితీరు పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో రికార్డులు, పెండింగ్, కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు అనుమానితులు మిస్సింగ్ ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

గ్రామాలలో కాలనీలలో రాత్రి వేళలో ప్రజలతో మమేకమై పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిష్టమైన చర్యలు రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 15న లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులను ఇరు వర్గాలతో మాట్లాడి రాజీమార్గం రాజమార్గం అని సూచించాలని అన్నారు. అనంతరం రామగుండం సీపీ చేతుల మీదుగా స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్,ఏసీపీ ప్రకాష్ మంచిర్యాల సిఐ రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి