-2కె రన్ జాతీయ సమైక్యతకు నిదర్శనం: ఎస్సై రాజశేఖర్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలు ముగింపు సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఏక్తా దివాస్, ‘రన్ ఫర్ యూనిటీ’ అనే నినాదంతో 2కె రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఠాగూర్ స్టేడియం నుండి ప్రారంభమై రామాలయం చౌరస్తా హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగిన 2కే రన్ లో మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణానికి చెందిన పలువురు నాయకులు, యువతి, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ‘రన్ ఫర్ యూనిటీ’ అనే నినాదంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2కె రన్ జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు.

భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పునస్కరించుకొని ‘రన్ ఫర్ యూనిటీ’ అనే నినాదంతో పరుగులు తీశామని అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఫలితంగా జాగిర్దారు వ్యవస్థలో ఉన్న రాజ్యాలన్నీ భారతదేశంలో అంతర్భాగమయ్యాయని తెలిపారు. పోలీసులు చేపట్టిన ఏక్తా దివాస్ వేడుకలను జాతి సమైక్యతను చాటి చెప్పే విధంగా పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కొనియాడారు. అనంతరం పట్టణ బాలికల గురుకుల విద్యార్థులకు క్రీడా పోటీల్లో పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు, నాయకులు, ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి