-సమస్యల పరిష్కారముకై ఎల్లప్పుడూ కృషి: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యేక్షత:-జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉద్యోగుల సమావేశంలో శాఖ పరమైన ఉద్యోగుల పలు సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసినందుకు మంచిర్యాల టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కందుకూరి సురేష్ బాబు, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య, జిల్లా యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్, నీటి పారుదల శాఖ ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలిపారు. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..నీటిపారుదల శాఖ,మిగిలిన శాఖ పరమైన ఉద్యోగుల సమస్యలను మంచిర్యాల టిఎన్జీవో దృష్టికి తీసుకు వస్తే కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు సహకారంతో సమస్యల పరిష్కారముకై ఎల్లప్పుడూ కృషి చేస్తామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉద్యోగులు రోశయ్య, సంపత్ ,సారిక తదితరులు పాల్గొన్నారు.