
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముందుగా గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గాంధీజీ ఎన్నుకున్న అంశా మార్గంలో అందరూ నడవాలని అదేవిధంగా భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి భారత దేశ అభివృద్ధి కొరకు చేసిన సేవలపై కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి, పబ్లిసిటీ సెక్రెటరీ యూసఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.