-బతుకమ్మ వేడుకలను ప్రారంభించిన:మారం జగదీశ్వర్
-మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ముందస్తు సద్దుల బంగారు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల వేడుకలకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ పాల్గొని బతుకమ్మ వేడుకలును ప్రారంభించారు.జిల్లాలోని టీఎన్జీవో మహిళ సభ్యులు తీరొక రంగురంగుల పూలతో బతుకమ్మని పేర్చి హౌసింగ్ సొసైటీ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ఆటపాటలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో ఆడి పాడారు. అనంతరం గోదావరి నదిలో బతుకమ్మలను నిమర్జనం చేశారు. గౌరీ దేవిని పూజించిన ఆడపడుచులు పసుపు,కుంకుమ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ లోని మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయుల అందరికీ ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణలో మహిళలు అందరూ పూలను పూజిస్తూ గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండగనే అని మహిళా అందరూ బతుకమ్మ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ మహిళా ఉద్యోగులు అందరికీ ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క మహిళ బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ సంద అశోక్, టీఎన్జీవో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, మాజీ కార్యదర్శి పుప్పాల హనుమంతరావు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి సందీప్, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, టిఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ జిల్లా టిఎన్జీవో కార్యవర్గ సభ్యులు మహిళా సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.
