మంచిర్యాల ప్రత్యక్షత:-గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన ఉద్యోగాల సంఘాల గుర్తింపును తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించడం హర్షనీయమని టిజిఈజేఏసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 8న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 185 తో తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను పునఃస్థాపించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ కౌన్సిల్ వలన ఉద్యోగులు, అధికారుల మధ్య నేరుగా చర్చలు జరిగి, ఉద్యోగుల సమస్యలు, క్రమశిక్షణ చర్యలు, విధి విధానాలు, జాబ్ చార్ట్, పని ఒత్తిడి వంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి నేరుగా చేరుతాయన్నారు. గత ప్రభుత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేకపోవడం వలన ఉద్యోగుల కష్టాలు ప్రభుత్వ దృష్టికి నేరుగా చేరలేదని, ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు జిల్లా టిజిఈజేఏసీ, టిఎన్జీవో పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈవిజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాస్ రావు, ముజీబ్ ల కృషి ప్రశంసనీయమని, వారికి సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా టిజిఈజేఏసీ ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి, జేఏసి కో చైర్మన్లు చక్రపాణి, కృష్ణ, వెంకటేశ్వర్లు, సుభాష్, సుమిత్, సంజీవ్, వేణుగోపాల్, సత్తయ్య, ప్రభాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు, దుర్గాప్రసాద్, డిప్యూటీ చైర్మన్లు భూముల రామ్మోహన్, సుధాకర్, టీఎన్జీవో యూనియన్ జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్,తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, రవి కిరణ్, ప్రభు,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, రోశయ్య, ప్రణవనంద్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి