మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక మండలి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి-పల్లవి దంపతుల నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా లక్ష్మీ గణపతి హోమం ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు నెరవేరాలని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కోర్టు కేసు సమస్యలు పరిష్కారం కావాలని హౌసింగ్ సొసైటీ సభ్యులందరూ అతి త్వరలో ఇళ్లను నిర్మించుకోవాలని లక్ష్మీ గణపతి హోమం నిర్వహించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యుల దంపతులు పొన్న స్వప్న-మల్లయ్య,గుండేటి అరుణ-యోగేశ్వర్,గుండేటి వసంత వెంకటేశ్వర్,గుండేటి సత్యమ్మ-నాందేవ్, పొలంపల్లి స్వర్ణలత-వెంకటేష్, కొండ్రా పుష్పలత-బాలయ్య,వెనం కళావతి లక్ష్మి నారాయణ,సానబోయిన పద్మావతి-సత్యనారాయణ,బెక్కం విజయలలిత-ఊషన్న,నక్క ఇందిర-రాజన్న కుటుంబ సమేతంగా లక్ష్మి గణపతి హోమంలో పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి