-జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలో ఇటీవల విధుల నుంచి తొలగించిన టర్మినేషన్ ఓపీఎస్ లను సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తో ఉద్యోగుల సమస్యలపై పలు అంశాల పైన చర్చించి వారికీ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..గత రెండు సంవత్సరముల నుండి సర్పంచులు లేకపోయినప్పటికీ గ్రామాలకు మెయింటెనెన్స్ కోసం ఎటువంటి నిధులు రాకపోయినప్పటికీ శానిటేషన్ వీధి దీపాలు ఇతర గ్రామపంచాయతీ నిర్వహణ ఖర్చులు పంచాయతీ కార్యదర్శులు తమ జేబుల నుంచి పెట్టుకొని గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కృషి చేస్తున్నారన్నారు, దానితో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్,మిషన్ భగీరథ, అన్ని రకాల సర్వేల్లో పాల్గొంటూ ప్రభుత్వ లక్ష్యాలు నిర్వహించడంలో కీలకపాత్ర వహిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీపతి బాపూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్న మల్లయ్య, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రావణ్ కుమార్, లక్షెట్టిపేట యూనిట్ అధ్యక్షులు గోళ్ళ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు పూదరి నరేందర్, కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి