-జాతీయ జెండాను ఎగురవేసిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండా ను తన చేతుల మీదుగా ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి దేశం కోసం పోరాడారని,

అలాగే అనునిత్యం సైనికులు దేశరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారన్నారు.వారందరికీ మనం రుణపడి ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు, కోశాధికారి అనుముల సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్,ప్రశాంత్ లు తదితరులు పాల్గొన్నారు.