
మంచిర్యాల (ప్రత్యక్షత):-నూతన జిల్లా ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన ఏ సత్య చంద్ర ను సోమవారం జిల్లా టిఎన్జీవో నేతలు ఇరిగేషన్ కార్యాలయంలో మర్యాదగా పూర్వకంగా కలిసి, ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్య చంద్ర ను టీఎన్జీవో నేతలు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలుపుతూ, మొక్కను బహుకరించారు. అనంతరం టిఎన్జీవో నేతలు మాట్లాడుతూ, ఇరిగేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరగా, చీఫ్ ఇంజనీర్ సత్యచంద్ర సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు గోపాల్, జిల్లా కమిటీ సభ్యులు రోశయ్య లు పాల్గొన్నారు.