
బోథ్ మార్కెట్ యార్డ్ లో పంటలు పండించే రైతన్నలు పస్థులు ఉండొద్దు అనే ఉద్దేశంతో పంట అమ్ముకోవడానికి వచ్చే రైతన్నల కడుపునింపాలన్న గొప్ప ఆలోచన తో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ మార్కెట్ యార్డ్ లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.గత ఆరు రోజులుగా నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుండగా మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,తహసీల్దార్ సుభాష్ చందర్ లు హాజరయ్యి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు భోజనం వడ్డన చేశారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్రార్,సొసైటి డైరెక్టర్ కసిరె పోతన్న కాంగ్రెస్ నాయకులు అబుద్,గడ్డల నారాయణ,భోజన్న తదితరులు పాల్గొన్నారు.
