ప్రత్యక్షత:- హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా పెరుమాండ్ల నర్సాగౌడ్ నూతనంగా ఎన్నికయ్యారు. హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏడు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మే 12న ప్రారంభమై నెల రోజులపాటు రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ నర్సాగౌడ్ పేర్కొన్నారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేయమని అన్నారు. ఈ ఆలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని నర్సాగౌడ్ తెలిపారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి