-వెల్లడించిన కళాశాల ప్రిన్సిపల్ మందపెల్లి సంద్య

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ నగర్ లో గల తెలంగాణ మైనార్టీ బాలికల కళాశాల విద్యార్థినీలు మంచి ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మందపెల్లి సంద్య మాట్లాడుతూ..కళాశాల ద్వితీయ సంవత్సరం బైపిసి లో బి సాత్విక 980/1000 మార్కులు, ఎంపిసి లో అజ్ఘర్ బి 974/1000 మార్కులు సాధించారని, అదే విధంగా మొదటి సంవత్సరం బైపిసి లో ఏ లిఖిత 429/440 మార్కులు, ఎంపిసి లో సిద్ర కోహ్నిన్ 463/470 మార్కులు సాధించారని తెలిపారు. కళాశాల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 15 మంది విద్యార్థినీలు 900 పైగా మార్కులు సాధించారని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో 14 మంది విద్యార్థినీలు 400 పైగా మార్కులు సాధించారన్నారు. ఈసందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతకైనా మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఇంకా కృషి చేస్తామని తెలిపారు. కళాశాలలో 120 మంది విద్యార్థులతో ఎంసెట్ క్రాష్ కోర్స్ ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగిందని, కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవని తెలిపారు. అడ్మిషన్ కొరకు కళాశాలలో నేరుగా సంప్రదించవచ్చునని సూచించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి