-శ్రీహర్ష డిగ్రీ ఛైర్మెన్ పల్లె భూమేష్

మంచిర్యాల ప్రత్యక్షత:- కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కళాశాలల్లో ఇటీవల వెలువడిన 1, 3, 5 సెమిస్టర్ లో నిర్వహించిన పరీక్షల్లో మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సైన్స్ అండ్ కామర్స్ విభాగంలో 9 జీపీఏ పైనా పాయింట్లు సాధించిన విద్యార్థులను శ్రీహర్ష కళాశాలల ఛైర్మెన్ పల్లె భూమేష్ అభినందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డిగ్రీ విద్యతో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు డిగ్రీ పట్టా పొందాలని సూచించారు. తమ కళాశాలలో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా టాస్క్ ను ఏర్పాటు చేసినట్లు, తద్వారా పలు ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నామని, కళాశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి