ఘనంగా ఆర్డీవో కార్యాలయంలో మహిళ దినోత్సవ వేడుకలు

0
123

మంచిర్యాల (ప్రత్యక్షత): మహిళలు ఉన్నత చదువులతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్తమమైన మహిళలచే కేక్ కట్టింగ్ చేయించారు. అనంతరం ఉత్తమ మహిళలుగా ఎంపికైన వారిని ప్రశంస పత్రాలతో అందజేసి ఆ మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలు ఉన్నతస్థాయికి చేరినప్పుడే గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనిన్నారు.లింగ వివక్ష లేకుండా పిల్లలను పెంచినప్పుడే మహిళలపట్ల వివక్ష తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో రమేష్, దండేపల్లి తహసిల్దార్ సంధ్యారాణి, మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి