
మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ రిటైర్డ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రతి ఏటా టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను కోరుకుంటున్నట్లు తెలిపారు. మహిళలకు టీఎన్జీవో ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్యామలాదేవి అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు, మహిళా సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

