
మంచిర్యాల ప్రత్యక్షత:- నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌరమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు నడిమెట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సునీతతో పాటు కాలనీ మహిళలు, సభ్యులు పాల్గొన్నారు.

