
మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ పరిశీలించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పథకం ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని తిరుపతి ఆసుపత్రితో పాటు ఇతర ఎన్‌ఈహెచ్‌ఎస్ అనుబంధ ఆసుపత్రుల్లోనూ పథకం ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఇతర సంఘం నాయకులు పాల్గొన్నారు. పథకం అమలును పరిశీలించిన కేంద్ర సంఘం అధ్యక్షులకు జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

