హోమ్టాప్ న్యూస్ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మహాధర్నా

ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మహాధర్నా

Published on

spot_img

-డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

మంచిర్యాల ప్రత్యక్షత:- ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం నస్పూర్‌ జిల్లా సమీకృత సముదాయ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు హాజరయ్యారు.జిల్లా సమీకృత సముదాయ కార్యాలయ ముఖద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులకు రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రతి నెల రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ సమస్యను పరిష్కరించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగ సంఘాలకు తగిన గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.వనజా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సంఘాలతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు, టీజీవో, టీఎన్జీవో ప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Latest articles

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...

సీపీఎస్‌ రద్దుకు సెప్టెంబర్‌ 1న నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న...

More like this

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...