
మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్ర టీజీజేఏసీ పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించనున్న మహా ధర్నా, నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని టీజీజేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి సిబ్బంది తదితరులు ఐక్యంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు శ్రవణ్, మల్లయ్య, నాగుల గోపాల్, అజయ్ ప్రశాంత్, నామ్దేవ్, అల్లాడి శ్రీనివాస్, రమేష్, నియాసుద్దీన్, శాంతి, తేజస్విని, నరేష్, రవీంద్ర, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు.

