హోమ్టాప్ న్యూస్స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై దండేపల్లిలో అవగాహన సదస్సు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై దండేపల్లిలో అవగాహన సదస్సు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై దండేపల్లి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ రోహిత్ దేశ్‌పాండే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గ నాయబ్ తహసిల్దార్ (ఎన్నికలు) గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణ విధానంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో చేపట్టాలని సూచించారు.జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించి, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో నాయబ్ తహసిల్దార్ మాధవి, మండల పరిధిలోని బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కీలకమని అధికారులు పేర్కొన్నారు.

Latest articles

నకిలీ విత్తనాల విక్రేతపై పీడీ యాక్ట్ అమలు

-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

మంచిర్యాల ప్రత్యక్షత:- హాజీపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ పుష్పలత...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

లక్షెట్టిపేట ప్రత్యక్షత:- మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్...

More like this