-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మండల తహసిల్దార్ రఫత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టాలని సూచించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ప్రతి బీఎల్‌వో ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి, 100 శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. మండల పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సూపర్వైజర్లకు ప్రత్యేక సవరణ ప్రక్రియ, సమాచార సేకరణ విధానం, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సీనియర్ సహాయకుడు సంజీవ్, మండల గిర్దావర్లు శిరీష, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, జీపీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.



