-ఆల్ఫాన్సా పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-నూతన ఆవిష్కరణలతోనే మానవ జీవనం మనుగడ సాగిస్తూ, దినదినం అభివృద్ధి చెందుతుందని పట్టణంలోని ఆల్ఫాన్సా కాన్వెంట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిస్టర్ బ్లెస్సి, సిస్టర్ టెస్సి లు తెలిపారు.పట్టణంలోని ఆల్ఫోన్సా కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) నిర్వహించారు.ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించి, వివరించారు.ఈ పలు ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, జీవన పరిణామ క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టంగా పేర్కొనబడే అగ్నిని ఆవిష్కరించడం వలన మానవ జీవనం పరిణామ క్రమంలో కీలకమైన మలుపు తిరిగిందని వివరించారు.విద్యార్థి దశలోనే నూతన ఆవిష్కరణల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేలా, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలలో పాల్గొని, తన నైపుణ్యాన్ని,సృజనాత్మకతను ప్రదర్శించి, నైపుణ్యాన్ని చాటాలని సూచించారు.వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని,వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి