మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఏడి,తహసిల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు లు విచ్చేసి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 50 మంది టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు నిరంతరాయంగా కష్టపడి అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి సంయుక్త కార్యదర్శి సునీత, ఏడి శ్రీనివాస్, డిఐ నసీర్, ఏడి శేషురావు, సర్వేయర్స్ కుమార్ సైదులు, సర్వే, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి