-కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన అధ్యక్షులు గడియారం శ్రీహరి నేతృత్వంలో బుధవారం కొనసాగింది. నస్పూర్ శివారు సర్వే నెంబర్ 42లో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని అన్నారు. సొసైటీ సభ్యులు ఎవరైనా ఇతరులు అమ్మడం కానీ కొనడం కానీ చెయ్యరాదని సభ్యులకు సమావేశంలో తీర్మానించారు. హౌసింగ్ సొసైటీ కి సంబంధంలేని ఇతరులు ఈ స్థలాలు మావే అని వేరే వ్యక్తులకు అమ్మినట్లయితే సంఘం దృష్టికి వచ్చి రుజువైతే అమ్మిన వారి పైన కొన్న వారి పైన అలాగే టీఎన్జీవో సంఘం సభ్యులైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇంటి స్థలాలు అమ్మిన, కొనుగోలు చేసిన హౌసింగ్ సొసైటీ సంఘం కు ఎలాంటి బాధ్యత వహించదు అని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహమ్మద్ హబీబ్ హుస్సేన్,ఉపాధ్యక్షులు సైండ్ల మొండయ్య, సంయుక్త కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి దొరిశెట్టి రాజమౌళి,కార్యవర్గ సభ్యులు నాగుల గోపాల్,బేతు కళావతి, ఏవిఆర్డి ప్రసాద్,సయ్యద్ ఇంతియాజ్ సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి