
లక్షెట్టిపేట ప్రత్యక్షత:-మండలంలోని ఉత్కూర్ రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ గడియారం శ్రీహరి పాల్గొని బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వంద శాతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, ఎన్నికల సీనియర్ సహాయకులు సంజీవ్, నవీత్ తదితరులు పాల్గొన్నారు.


