మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కు నూతనముగా విచ్చేసిన జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు మాట్లాడుతూ..టీఎన్జీవో యూనియన్ కు సహకార శాఖ తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని టీఎన్జీవో సభ్యులు అందరూ సమిష్టిగా కృషిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సహకార శాఖ ఉద్యోగులు టీఎన్జీవో యూనియన్ కు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి సంయుక్త కార్యదర్శి సునీత, సురేందర్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ప్రసాద్, రాజేందర్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి