మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్యావరణహిత శ్రీ సిద్ధి వినాయక మండలి వద్ద గురువారం ఘనంగా విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వహణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.శుక్రవారం ఉదయం నవరాత్రి పూజలు అందుకున్న వినాయక లడ్డు, కలశం వేలం పాట, దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ప్రత్యేకమైన ఏకరూప దుస్తులు,ప్రకృతి మిత్ర పదార్థాల తో అలంకరించిన వాహనంతో శోభయాత్ర నిమజ్జనం ఉంటుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, ఉత్సవ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ తెలిపారు.అనంతరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 500 మంది భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నిత్య అన్నదానం,అల్పాహారం వివిధ సేవ పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పొన్న మల్లయ్య, సైండ్ల మొండయ్య, కస్తూరి నాగేశ్వర్, భూముల రామ్మోహన్, హబీబ్ హుస్సేన్, శ్రీపతి బాబురావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి