-ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్:పల్లె భూమేష్

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో అందరిని నోరూరించేలా సిద్ధం చేసిన వంటకాలు ఘుమ ఘుమలాడాయి. బుధవారం శ్రీ హర్ష డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు రకరకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి కాలంలో ఆహార పదార్థాలు కలుషితం అయ్యి ప్రజలు రకరకాల రోగాల బారిన పడుతున్నారని, సహజసిద్దంగా పండించే పంట నుండి పదార్థాలను సేకరించి, ఈ ఫుడ్ ఫెస్ట్ లో ప్రదర్శించడం అభినందనీయమని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు చదువుతో పాటు వంటకాలలో సైతం నేర్పరితనం ఉండాలని, వారు రకరకాల వంటలు నేర్చుకునేలా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవలం రుచికరమైన వంటకాలే కాకుండా బలవర్ధకమైన రాగులు, సజ్జలు, కొరమీనులు, జొన్న, మొక్కజొన్న లతో సైతం ఎన్నో రకాలైన వంటకాలు చేయవచ్చునని తెలిసేలా వంటకాలు సిద్ధం చేయడం జరిగిందని, ఈ విధమైన వంటకాలతో ప్రతి విద్యార్థికి పౌష్టిక ఆహారం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందాన్ని, విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పోటు మనోహర్ రెడ్డి, తనుగుల శ్రావణ్, కళాశాల ప్రిన్సిపాల్ ఆరెల్లి అనిత, కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.