హోమ్ టాప్ న్యూస్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

0

లక్షేట్టిపేట్ ప్రత్యక్షత:-జిల్లాలోని లక్షేట్టిపేట్ లో గల పీఎంశ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల, కళాశాల లో నిర్వహించు వృత్తి విద్యా సమ్మర్ ఇంటర్న్ షిప్ – 2026 శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాలయం ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. బుధవారం విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మంగ మాట్లాడుతూ,విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ తిరుమల్, వృతి విద్య శిక్షకుడు మహేష్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version